Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

Bengaluru, March 13:  గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన బెంగళూరు (Google Bengaluru) కార్యాలయంలో ఒక ఉద్యోగికి కరోనావైరస్ (COVID-19) పాజిటివ్ అని తేలినట్లు శుక్రవారం ధృవీకరించింది. ఈ ప్రాణాంతక వైరస్ యొక్క లక్షణాలు బయటపడటానికి ముందు ఆ ఉద్యోగి కొన్ని గంటలపాటు ఆఫీసులో పనిచేసినట్లు కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

వైరస్ నిర్ధారణ అయిన దగ్గర్నించి ఉద్యోగిని నిర్బంధంలో ఉంచారు. దీంతో అతడితో ఎవరెవరు కంటాక్ట్ అయ్యారనే దానిపై గూగుల్ ఇండియా ఆరాతీస్తుంది. తన సహచర ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై గూగుల్ యాజమాన్యం రిపోర్ట్స్ కోరినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

ఆఫీసులో పనిచేసే మిగతా ఉద్యోగులందరికీ శుక్రవారం 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాల్సిందిగా గూగూల్ యాజమాన్యం సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఆఫీస్ మొత్తం శానిటైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించింది.

Here's the update: 

తాజా కేసుతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి భారతదేశంలో, COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 75 కు పెరిగాయి. ఇందులో కేరళలో నమోదైన తొలి 3 కేసుల్లో బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు.

మార్కెట్లను కుదిపేస్తున్న కరోనావైరస్ భయం, భారీగా పతనమవుతున్న మార్కెట్లు

ఇప్పటివరకు, ఇండియాలో కరోనావైరస్ ద్వారా ఒక మరణం సంభవించింది. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి హైదరాబాదులో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు

మరోవైపు హైదరాబాదులో నమోదైన తొలి కరోనావైరస్ కేసు, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే 24 ఏళ్ల యువకుడు ప్రస్తుతం కోలుకున్నాడు. అతణ్ని కొన్ని రోజుల వరకు అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.