Jhansi Road Accident: వీడియో ఇదిగో.. ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మాఫియా డాన్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి
ఉమేష్ పాల్ హత్య కేసుతో పాటు 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లను 2023 ఏప్రిల్‌లో పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు లైవ్ టీవీ కెమెరాల ముందే కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ముగిసిన దాదాపు మూడేళ్ల తర్వాత.. ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Jhansi Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) ప్రాంతాన్ని నాలుగు దశాబ్దాల పాటు తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ గురువారం యుపీలోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జైలులో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. అబాన్ అహ్మద్ తన స్నేహితులతో కలిసి ప్రయాగ్‌రాజ్ నుండి ఝాన్సీకి ఎస్‌యూవీ వాహనంలో బయలుదేరాడు. ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే.. వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా హైవే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో అబాన్ అహ్మద్‌తో పాటు సోను అనే మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఝాన్సీ జిల్లా జైలులో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకే అబాన్ వెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బలవంతపు వసూళ్లు, 2023 ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసుల్లో అలీ నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి అతీక్ అహ్మద్ మరణానంతరం 'ఐఎస్-227' గ్యాంగ్ బాధ్యతలను అలీనే పర్యవేక్షిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
Aban Ahmed Dies in Jhansi Road Accident: