Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు
అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కీలక సమావేశంలో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది.
Vjy, Jan 21: అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కీలక సమావేశంలో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు.
కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్‌లో ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Anantapur DRO playing online rummy keeping public issues aside
సమావేశ మందిరంలో ఆన్‌లైన్ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది.. అనే దానిపై డీఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. డీఆర్ఓను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డీఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.