Andhra Pradesh Shocker: మూడో తరగతి చిన్నారిని స్కూలు రూంలోకి తీసుకువెళ్లి టీచర్ దారుణం, తొడ కొరుకుతూ తాకరాని చోట తాకుతూ నీచ ప్రవర్తన

విద్యార్థిని వద్దు సార్‌ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.

Representational Image (File Photo)

Kodur, Nov 5: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడైన టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన వివరాల్లోకెళితే.. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచే­స్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపా­లరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్‌ టీచర్‌ను నియమించుకుని అక్కడి విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు.

వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే బాలిక బట్టలు విప్పి అత్యాచారం చేయబోయిన కామాంధుడు, గుడి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై దారుణం

ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ ఆ పాపను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్‌ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.