Delhi Shocker: కుక్క మొరిగిందని యజమానిపై ఇనుపరాడ్ తో దాడి, ఢిల్లీలో విచక్షణ కోల్పోయిన వ్యక్తి, అడ్డం వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి, యజమానిని కొట్టినందుకు నిందితుడ్ని కరిచి పగతీర్చుకున్న కుక్క! ఇదుగోండి వీడియో
పొరుగింటి కుక్క అతడ్ని చూసి మొరిగింది. చిరాకుపడిన ఆ వ్యక్తి వెంటనే ఇనుప రాడ్‌ను పట్టుకుని వచ్చాడు. ఆ కుక్కపై దాడి చేయబోగా యజమానులతోపాటు పొరుగున ఉన్న వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోని ధరమ్‌వీర్ దహియా తన చేతిలో ఉన్న రాడ్‌తో కుక్క తలపై కొట్టాడు
New Delhi, July 04: కుక్క (Dog) మొరగడంతో ఒక వ్యక్తి చిరాకుపడ్డాడు. ఆ కుక్కతోపాటు దాని యజమానులైన పొరుగువారిపై ఇనుప రాడ్‌తో (Iron rod) దాడి చేశాడు. దీంతో కుక్కతో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఈ సంఘటన జరిగింది. పశ్చిమ్ విహార్ (paschim vihar ) ప్రాంతానికి చెందిన ధరమ్‌వీర్ దహియా (Dharamveer dahiya) ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే పొరుగింటి కుక్క అతడ్ని చూసి మొరిగింది. చిరాకుపడిన ఆ వ్యక్తి వెంటనే ఇనుప రాడ్‌ను పట్టుకుని వచ్చాడు. ఆ కుక్కపై దాడి చేయబోగా యజమానులతోపాటు పొరుగున ఉన్న వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోని ధరమ్‌వీర్ దహియా తన చేతిలో ఉన్న రాడ్‌తో కుక్క తలపై కొట్టాడు. అలాగే పక్కనే ఉన్న 53 ఏళ్ల పొరుగు వ్యక్తిని కూడా ఆ రాడ్‌తో కొట్టాడు. దీంతో కుక్క యజమాని రక్షిత్ (Raksith), ఆ కుటుంబానికి చెందిన మహిళ ఆ వ్యక్తిని పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య పెనుగులాట జరిగింది.
మరోవైపు ధరమ్‌వీర్ ఇనుప రాడ్‌తో కొట్టడంతో కుప్పకూలిన కుక్క కొంత సేపటి తర్వాత లేచింది. యజమానితో పెనుగులాడుతున్న ఆ వ్యక్తిని కరిచింది. ఈ దాడిలో ఆ కుక్కతోపాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయపడిన కుక్కను దాని యజయాని పశు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అయితే అక్కడి సీసీటీవీలో(CCTV) రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.