ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసి.. లాకప్‌లో లాఠీలతో (8 Men Beaten By Cops) చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video Leave Jail ) మారింది. ఈ వీడియో బయటకు రావడంతో బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు వారు దోషులు అనేందుకు సాక్ష్యం చూపాలని కోరారు.
అయితే అరెస్ట్ చేసిన 8 మంది అలర్లల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించింది. ఇక, పోలీసులు దారుణంగా కొట్టడంతో మహ్మద్ అలీ అనే వ్యక్తి చేయి విరిగిపోయింది. కాగా షహరాన్‌పూర్‌లో (Saharanpur) పెద్దఎత్తున అల్లర్ల కారణంగా 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.
Here's Viral Video
news24official UP : उपद्रवियों की पुलिस ने की पिटाई, BJP नेता Shalabh Mani Tripathi ने शेयर किया वीडियो pic.twitter.com/yxbE18txaU
— Zeyad Alam (@ZeyadAlam18) June 12, 2022
పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి స్పందించారు. ఈ వీడియోకు ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ‍్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.