BECA Agreement: చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా బెకా అగ్రిమెంట్, ఇంతకీ బెకా అంటే ఏమిటీ ? దీని ద్వారా ఇండియాకు కలిగే ప్రయోజనం ఏమిటీ? బీఈసీఏ ఒప్పందంపై పూర్తి సమాచారం

ఈ ఒప్పందంలో భాగంగా సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు (BECA Signed During India-US) చేశారు.

BECA Agreement Signed Between India & US (Photo Credits: ANI)

New Delhi, Oct 27: భార‌త్‌‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(BECA) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. భారత్‌-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు (BECA Signed During India-US) చేశారు. ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ట్లు ర‌క్ష‌ణ‌మంత్రిత్వ‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి జీవేశ్ నంద‌న్ తెలిపారు.

మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్‌ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్‌ పొందే వెసులుబాటు కలుగుతుంది.

ఈ నేప‌థ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మీడియాతో మాట్లాడారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యాయ‌ని, రెండు దేశాల మ‌ధ్య కొత్త యుగం ప్రారంభంకావాల‌న్నారు. గ‌త ఏడాది త‌ర‌హాలోనూ త‌మ విధానాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, మునుముందు ఇంకా ఎంతో చేరుకోవాల్సి ఉంద‌న్నారు. అనంత‌రం 2+2 మంత్రుల స‌మావేశం త‌ర్వాత కూడా మైఖేల్ పొంపియో మాట్లాడుతూ.. భార‌త సైనిక ద‌ళాల‌కు చెందిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త సైనిక ద‌ళాల్లో ప‌నిచేస్తూ ప్రాణ త్యాగం చేసిన వారి గౌర‌వ సూచ‌కంగా తాము ఇవాళ నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్‌ను విజిట్ చేసిన‌ట్లు తెలిపారు.

పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రదాడి, ఏడుగురి మృతి.. 70 మందికి గాయాలు, మదర్సాలో పేలిన బాంబు, విచారణ చేపట్టిన పెషావర్ పోలీసులు

ఇటీవ‌ల ల‌డాఖ్ స‌రిహ‌ద్దులోని గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భార‌తీయ జ‌వాన్ల మృతి ప‌ట్ల కూడా సంతాపం తెలిపిన‌ట్లు పొంపియో చెప్పారు. సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు భార‌త్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు అమెరికా అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చైనా క‌మ్యూనిస్టు పార్టీ నుంచి మాత్ర‌మే కాదు, ఎటువంటి బెదిరింపుల‌నైనా ఎదుర్కొనేందుకు భార‌త్‌, అమెరికా దేశాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తాయ‌న్నారు. సైబ‌ర్‌, నేవీ రంగాల్లో గ‌త ఏడాది త‌మ స‌హ‌కారాన్ని విస్త‌రించిన‌ట్లు పొంపియో తెలిపారు.

సరిహద్దుల్లో మానవత్వాన్ని చాటుకున్న భారత సైన్యం, 13 జడల బర్రెలు, 4 దూడలను చైనా సైన్యానికి అప్పగించిన భారత జవాన్లు, కృతజ్ఞతలు తెలిపిన చైనా అధికారులు

కాగా తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం (India-US to sign BECA agreement) చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశాల్లో సమగ్ర, ఫలవంతమైన చర్చలు జరిపామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి అని అన్నారు. రక్షణ సంబంధాలపై ఉపయుక్తమైన చర్చలు జరిగాయని, సైనిక సహకారంలోనూ ఇరుదేశాల మధ్య పురోగతి సాధ్యమయ్యేలా చర్చలు సాగాయని తెలిపారు. ఇక రెండు దశాబ్ధాలుగా భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్య విస్తరణ స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు.

సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు

బెకా ఏమిటీ, దానితో ఇండియాకు ప్రయోజనం ఎంత?

సరిహద్దుల్లో శత్రుదేశ కదలికలకు సంబంధించి నిర్ధిష్ట సమాచారం పొందే అవకాశం ఇన్నాళ్లూ భారత్‌కు లేదు. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లాంటి 14 వేల అడుగుల ఎత్తున ఉన్న యుద్ధక్షేత్రంలో సైనిక మోహరింపులను వెంటనే తెలుసుకునే వీలుండేది కాదు. స్థానిక ప్రజల ద్వారానో, ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారానో కాస్త సమాచారం లభించేది. ఇకపై ఉపగ్రహ సమాచారం ద్వారా శత్రు కదలికలను ముందే పసిగట్టి రక్షణ చర్యలను ఈ బెకా ద్వారా  భారత్‌ తీసుకోవచ్చు.

ఆ సమాచారంతో చైనా గానీ, పాక్‌ గానీ ఇండియాలోకి చొచ్చుకొచ్చే లోపే వాటిని నిరోధించే వ్యూహాలతో రంగంలోకి దిగొచ్చు. అమెరికా వివిధ దేశాలపై జరుపుతున్న వైమానిక దాడులకు ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వీడియోలే ఆధారం. భారత ఉపఖండంలో తనకు విశ్వాసపాత్రమైన మిత్ర దేశంగా మసలుతున్న భారత్‌తో బంధం పెంచుకొనేందుకు అమెరికా ఈ రహస్య సమాచారాన్ని అందజేసేందుకు అంగీకరించింది. చైనాను వదిలిపెట్టేది లేదంటూ ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్న అమెరికా ప్రయత్నాల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఒకటి.

కాగా సైనిక లాజిస్టిక్స్ మార్పిడి మరియు సురక్షిత సమాచార మార్పిడిని ప్రారంభించడానికి ఇరు దేశాలు ఇప్పటికే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (2002), లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (2016), కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (2018) పై సంతకం చేశాయి. ఇక భారతదేశంతో అమెరికాకు ఉన్న నాల్గవ అగ్రిమెంట్ బెకా.. ఇది సమాచార మార్పిడికి సంబంధించినది.