Bengaluru Shocker: బెడ్ మీద సెక్స్ చేస్తుండగా గుండెపోటు, ప్రియురాలి మీద అలాగే వాలిపోయిన 65 ఏళ్ల ప్రియుడు, అరెస్ట్ భయంతో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కు బయటపడేసిన ప్రియురాలు

బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వారం తర్వాత, మరణంపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి తన ప్రియురాలితో సెక్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో (67-year-old man dies during sex) చనిపోయాడని దర్యాప్తులో తేలింది

Representational Image | (Photo Credits: IANS)

Bengaluru, Nov 25: బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వారం తర్వాత, మరణంపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి తన ప్రియురాలితో సెక్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో (67-year-old man dies during sex) చనిపోయాడని దర్యాప్తులో తేలింది. వ్యక్తి మృతదేహాన్ని అతని ప్రియురాలు, ఆమె భర్త, ఆమె సోదరుడు ఎవరికీ తెలియకుండా ప్లాస్టిక్ సంచిలో కుక్కి పారేశారని (girlfriend's husband helps dump body) పోలీసులు తెలిపారు. 67 ఏళ్ల వ్యాపారవేత్త తన 35 ఏళ్ల ఇంటి పని మనిషితో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

జేపీ నగర్‌లోని పుట్టెనహళ్లి నివాసి బాల సుబ్రమణియన్‌గా గుర్తించిన వ్యక్తి నవంబర్ 16న తన మనవడిని బ్యాడ్మింటన్ తరగతులకు దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో బాల తన కోడలికి డయల్ చేసి తాను ఆలస్యంగా వస్తానని తెలిపాడు. అనంతరం తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో శృంగారంలో ఉండగా గుండెపోటుకు గురై మంచంపై మృతి చెందాడని బెంగుళూరు పోలీసులు తెలిపారు.

పూణేలో బాలికపై బాలుడు దారుణం, అందుకు ఒప్పుకోలేదని ఆమె ఫోటోతో నా భార్యవు అవుతావా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

చాలా కాలంగా అతను కనిపించకకపోవడంతో, అతని కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన ఒక రోజు తర్వాత, ప్లాస్టిక్ కవర్లు, బెడ్‌షీట్‌లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.

ఈ ఘటన తెరపైకి వస్తే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ, ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి జెపి నగర్‌లోని ఏకాంత ప్రదేశంలో పడేశారు. పోలీసులు ఆ మహిళను విచారించగా.. ఆ మహిళ తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది.

ఔరంగాబాద్‌లో దారుణం, యువతి మోసం చేసిందని పీహెచ్‌డీ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం, మంటల్లో కాలుతూనే ప్రియురాలిని వాటేసుకున్న యువకుడు

పోలీసులు తనపై హత్య కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో ఇంటి సహాయకురాలు భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని రోడ్డుపై పడేసింది. బాల సుబ్రమణ్యం తన పని మనిషితో చాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. బాలా గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నాడు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ చేసిన వాదనలు నిజమో కాదో నిర్ధారించడానికి వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Share Now

Advertisement
Share Now
Advertisement