Aurangabad, Nov 24: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో (Dr Babasaheb Ambedkar Marathwada Universit) పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి లవ్ ఫెయిల్యూర్ అయ్యానంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ మంటల్లో కాలుతూనే తాను ప్రేమిస్తున్న యువతుని గట్టిగా (woman colleague on fire) హత్తుకున్నాడు. ఈ ఘటనలో యువతి, యువకుడు (PhD student) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై పోలీసు అధికారి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గజానన్ ముండే అనే యువకుడు, యువతి ఇద్దరూ మరఠ్వాడ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ముండే తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులకు సదరు యువతి తనను అన్ని విధాలా వాడుకుందంటూ గజానన్ ముండే ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై కోపం పెంచుకున్న ముండే.. యువతి ల్యాబ్‌లో ప్రాజెక్ట్ చేస్తుండగా.. అక్కడికి వెళ్లి క్యాబిన్ తలుపులు మూసివేశాడు.
అనంతరం తనతోపాటు తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాటిళ్లలో ఒకటి తనపై పోసుకుని మరొకటి యువతిపై పోసి నిప్పంటించుకున్నాడు. అనంతరం మంటల్లో కాలుతూనే యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో అతనికి 80 శాతం, యువతికి 50శాతం కాలిన గాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బేగంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రశాంత్ వెల్లడించారు.