
Pune, Nov 24: మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యంతో పాటు షాక్ కు గురి చేస్తోంది. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు (Minor booked under POSCO) కారణం అయ్యింది కూడా ఈ పోస్టే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పూణెలోని హదప్సర్ ప్రాంతంలో గల ఓ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడు.. గత కొంతకాలం నుంచి అదే పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలిక వెంటపడుతున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ బాలికను వేధించేవాడు.తన స్నేహితుడిగా ఉండాలని, లేకుంటే కిడ్నాప్ చేస్తానని బాలికను బెదిరించాడు. కానీ ఆ అమ్మాయి అతడిని పట్టించుకోలేదు.
బాలిక తనను పట్టించుకోకపోవడాన్ని చూసిన నిందితుడు బాలుడు ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని (posting objectionable comment) పోస్ట్ చేశాడు. బాలిక ఫొటో తీసి (her classmate's photo on Instagram) తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘నువ్వు నా భార్యవి అవుతావా..?’ అంటూ స్టేటస్ పెట్టాడు. అది చూసిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.బాలుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద లైంగిక వేధింపులకు పాల్పడినందుకు హడప్‌సర్ పోలీసులు కేసు నమోదు చేశారు.