Bengaluru Horror: ఈ సారి బెంగుళూరులో, కదులుతున్న కారులో రాత్రంతా యువతిపై సామూహిక అత్యాచారం, ఆస్పత్రిలో చావు బతుకుల్లో బాధితురాలు

రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

Representative image (Photo Credit- Pixabay)

Blg, Mar 31: కామాంధులకు కదులుతున్న కారులే అత్యాచార వేదికలవుతున్నాయి. రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు సిటీలోని కోరమంగళ (Koramangala) ఏరియాలో గల నేషనల్ గేమ్స్‌ విలేజ్‌ పార్కులో గత నెల 25న బాధితురాలు తన స్నేహితునితో కలిసి కూర్చుని మాట్లాడుతోంది వారి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి రాత్రిపూట పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడినఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్‌ చేసి అక్కడికి రప్పించాడు.

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్, అర్థరాత్రి నిద్రపోతుండగా బెడ్ షీట్లపై పడిన రవ్వలు, ఒక్కసారిగా ఎగసిన మంటలు

వాళ్లు ఆయువతిని ప్రియుడు ముందే బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి కారులోకి ఎక్కించారు. అనంతరం ఆ కారును వీధుల్లో తిప్పుతూ కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

కాన్పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో మాడి మసైన 500 దుకాణాలు, దాదాపు రూ. 100 కోట్ల విలువైన వస్తువులు, నగదు అగ్నికి ఆహుతి

కాగా ఆమె పరిస్థితి పూర్తిగా బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి పోలీసులు తీసుకున్నట్లు వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి