Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి నయని పావని ఎలిమినేట్‌, ఆరువారాల్లో రూ. 6 లక్షలు సంపాదించిన పావని

ఈ వారం నామినేషన్స్‌లో చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉండగా, తక్కువ ఓట్లు వచ్చిన నయని ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్‌ అయింది.

Nayani Pavani (Photo-Instagram)

బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్‌ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉండగా, తక్కువ ఓట్లు వచ్చిన నయని ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్‌ అయింది. ప్రముఖ రియాలిటీ షో తొమ్మిదో వారంలో బిగ్ బాస్ హౌస్‌కి వీడ్కోలు పలికిన తాజా కంటెస్టెంట్‌గా మారిన నాయని పావని ప్రయాణం ముగిసింది.

నయని పావని అక్టోబర్ 6 న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా షోలోకి ప్రవేశించి నాలుగు వారాల పాటు కొనసాగింది. వారానికి రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమె 28-రోజుల పనిలో సుమారుగా రూ. 6 లక్షల ఆదాయం వచ్చింది. ఆమె ప్రయత్నాలు మరియు వ్యూహాలు ఉన్నప్పటికీ, తొమ్మిదవ వారం ఎలిమినేషన్ ఆమె పోటీ నుండి తప్పుకుంది. నయని నిష్క్రమణతో, బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ ఇప్పుడు 12 మంది కంటెస్టెంట్స్‌తో మిగిలిపోయింది, అందరూ ఫైనల్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నారు.

ఎలిమినేట్ సందర్భంగా హౌస్‌లో (Bigg Boss Telugu) ఉన్న వాళ్లలో ఐదుగురు డమ్మీ ఆటగాళ్లు, ముగ్గురు బెస్ట్‌ ఆటగాళ్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు.

గంగవ్వ: అందరితో పోల్చుకుంటే గేమ్‌ ఆడటం వయసురీత్యా ఆమెకు కష్టం.

రోహిణి: కొంచెం సేఫ్‌గా ఆడుతోంది. గొడవ జరిగినప్పుడు ముఖం మీదే మాట్లాడతారు. అవే విషయాలు ఆమె కూడా ఫాలో అవ్వాలి. ఒకరి తప్పు ఎత్తిచూపటం చాలా ఈజీ. మనం కూడా అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండాలి.వెనకాల మాట్లాడకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా బాగున్నా.. సింగిల్‌గా ఆడాలి.

ప్రేరణ: కోపంలో తెలియకుండా కొన్ని పదాలు వచ్చేస్తున్నాయి. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అనిపిస్తుందో.. నీ మాటల వల్ల ఎదుటి వాళ్లకూ అలాగే ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.

గౌతమ్‌: ఒకరి నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నామంటే అదే స్థాయిలో మనం కూడా ఇవ్వాలి. ఆ విషయంలో కొంచెం నియంత్రణలో ఉండాలి.

విష్ణు: నువ్వు గేమ్‌ బాగా ఆడతావు. అయితే, ఇప్పుడు ఆడుతున్నది సరిపోదు. ఇంకా బాగా ఆడాలి.

హరితేజ: నీలో ఆ ఫైర్‌ ఉంది. గతవారం  చూపించావు. ఇంకా బాగా ఆడాలి.

నిఖిల్‌: మంచి వ్యక్తి. బయటకు కోపంగా ఉంటాడు కానీ, చిన్న పిల్లాడి మనస్తత్వం. నువ్వు చెప్పాలనుకున్నది ముఖంపైనే చెప్పు.

పృథ్వీ: అందరి కన్నా నిజాయతీ కలిగిన వ్యక్తి పృథ్వీ. నీ మాటలకు నువ్వు కట్టుబడి ఉండు.