Bihar Blast: బీహార్‌లో భారీ పేలుళ్లు, ఏడు మంది మృతి, పలువురికి గాయాలు, పేలుడు ధాటికి మూడు ఇండ్లు ధ్వసం, పటాకులు తయారు చేస్తున్నట్లు ఇంట్లో పేలుడు

బీహార్‌లో (Bihar) విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని భగల్పూర్‌ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు (Explosion) జరిగాయి. జిల్లాలోని తాతర్‌పూర్‌లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇండ్లు ధ్వసమయ్యాయి.

Bihar Blast (Photo Credits: ANI)

Bhagalpur, March 4: బీహార్‌లో (Bihar) విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని భగల్పూర్‌ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు (Explosion) జరిగాయి. జిల్లాలోని తాతర్‌పూర్‌లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇండ్లు ధ్వసమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.కుటుంబం పటాకులు తయారు చేస్తున్నట్లు భగల్పూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ సుబ్రత్‌కుమార్‌ సేన్‌ తెలిపారు. పెలుళ్లవల్ల పక్కనే ఉన్న మూడు ఇండ్లు నేలమట్టమయ్యాయని చెప్పారు. పూర్తివివరాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు.

ఇక హైదరాబాద్‌ నగరంలో గత కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానిక సాయికృప పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో క్రికెట్‌ ఆడుతూ బౌలింగ్‌ సరిగా వేయడం లేదంటూ నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్‌ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement