Bihar Horror: ప్రియుడితో బెడ్ రూంలో భార్య, రసపట్టులో ఉండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన భర్త, భయంతో లోపలకు లాక్కెళ్లి భర్త మెడకు తాడు బిగించి చంపేసిన భార్య ఆమె ప్రియుడు, బీహార్‌లో దారుణ ఘటన
భార్య వేరొకరితో బెడ్ రూంలో సన్నిహితంగా ( Caught in compromising position) ఉండగా...అది భర్త కంటపడటంతో అతన్ని ఇద్దరూ చంపేశారు. తమ గుట్టు రట్టవడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే ఆ మహిళ కడతేర్చింది
Patna, April 22: బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య వేరొకరితో బెడ్ రూంలో సన్నిహితంగా ( Caught in compromising position) ఉండగా...అది భర్త కంటపడటంతో అతన్ని ఇద్దరూ చంపేశారు. తమ గుట్టు రట్టవడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే ఆ మహిళ కడతేర్చింది. బిహార్‌లోని పుర్నియ జిల్లా చకర్పద గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితుడిని పోషిత్ కుమార్‌గా గుర్తించారు.
పోలీసులు, కుమార్ కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ భార్య సావిత్రి దేవి అదే గ్రామానికి చెందిన అరవింద్ మహల్దార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగిఉంది. కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో భార్య సావిత్రి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. తమ బండారం బయటపడటంతో సావిత్రి ప్రియుడు మహల్దార్‌తో కలిసి కుమార్ మెడకు తాడు బిగించి (wife and her lover strangle man) ఉసురు తీసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మొబైల్ వ్యసనం.. భార్య గొంతో కోసి చంపేసిన భర్త, ఆమెకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మొదలైన గొడవ
బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కుమార్, సావిత్రిలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కుమార్, సావిత్రిలకు పదేండ్ల కిందట వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలి కుటుంబం భార్య, ఆమె ప్రేమికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ జితేంద్ర రాణా తెలిపారు.