BJP MLA Bihari Lal Nokha: మిడతల బుట్టతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, రైతుల గోడు పట్టించుకోవాలంటూ వినతి, మిడతలతో రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పంటలు నాశనం, రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అంటున్న రైతులు

బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా (Bihari Lal Nokha) శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఒక మిడతల బుట్టతో (Basket of Locusts) వెళ్లారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో ( Pakistan) ఎడారి ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వచ్చిన మిడతలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పంటలపై దాడి చేశాయి. దీంతో రైతులకు (Farmers) తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. దీంతో ఎమ్మెల్యే బిహారీ రైతుల ఆవేదనను అద్దం పట్టేందుకు మిడతలతో అసెంబ్లీకి వచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

BJP MLA enters Rajasthan assembly with basket of locusts, demands compensation for farmers (Photo-ANI)

Jaipur, January 24: సాధారణంగా దేశంలో ఎక్కడైనా నిరసన తెలియజేయడం ప్రజల హక్కు, ప్రజలతో పాటుగా ప్రజా ప్రతినిధులకు కూడా ఆ స్వాంతంత్ర్య ఉంటుంది. వారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతుంటారు.

ఏపీకి చెందిన మాజీ ఎంపీ దివంగత శివ ప్రసాద్ పార్లమెంటులో వివిధ వేషాలతో నిరసన తెలిపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA in Rajasthan) మిడతలతో నిరసన తెలిపారు. వివరాల్లోకెళ్తే...

రూ.లక్ష కోట్ల ఆదాయం లక్ష్యంగా శత్రు ఆస్తుల అమ్మకం

బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా (Bihari Lal Nokha) శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఒక మిడతల బుట్టతో (Basket of Locusts) వెళ్లారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో ( Pakistan) ఎడారి ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వచ్చిన మిడతలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పంటలపై దాడి చేశాయి.

Here's ANI Tweet

అక్రమ పౌరసత్వం పొందకుండా యూఎస్ ప్రెసిడెంట్ కఠిన చర్యలు

దీంతో రైతులకు (Farmers) తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. దీంతో ఎమ్మెల్యే బిహారీ రైతుల ఆవేదనను అద్దం పట్టేందుకు మిడతలతో అసెంబ్లీకి వచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

2019 ఎన్నికలకు గానూ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ

మిడతలను ప్యాక్‌ చేసి ఉన్న తట్టను ఎమ్మెల్యే బిహారీ లాల్‌ నోఖా తలపై పెట్టుకొని అసెంబ్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ...మిడతల వల్ల రైతులు పెద్ద మొత్తంలో పంట నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిడతల వల్ల ఏడు లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే బిహారీ లాల్‌ డిమాండ్‌ చేశారు.

శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan CM) బార్మర్ రైతులను కలుసుకున్నారు. ఈ స్థాయిలో పంటలు నాశనమవ్వడం రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అని రైతులు ఆయన ముందు వాపోయారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ వ్యవసాయ కార్యదర్శి కె.ఎస్. పన్ను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్ వ్యవసాయ నిపుణులతో పాటు భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని భయపడవద్దని రైతులకు భరోసానిచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement