Bombay High Court: మైనర్ బాలుడి మర్మాంగాలను తాకడం, పెదవులపై ముద్దుపెట్టడం నేరం కాదు, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఈ కేసులో నిందితుడికి బెయిల్

ఈ ఘటనలో నింది‌తు‌డికి బెయిల్‌ మంజూరు చేసింది.

Bombay High Court (Photo Credit: File Image)

Mumbai, May 16: పద్నా‌లు‌గేండ్ల మైనర్‌ బాలుడి పెదా‌లపై ఓ పురు‌షుడు ముద్దా‌డటం అస‌హజ శృంగార చర్య (అ‌న్‌‌నా‌చు‌రల్‌ సెక్స్‌) కిందకు రాదని బాంబే హైకోర్టు (Bombay High Court) తీర్పు‌ని‌చ్చింది. ఈ ఘటనలో నింది‌తు‌డికి బెయిల్‌ మంజూరు చేసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని ( Kissing Prima Facie Not Unnatural Sex) బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు.

కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు.అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్‌ చేయించుకునేందుకు వెళ్లినప్పుడు నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మహిళా లాయర్‌ని నడిరోడ్డుపై కడుపులో బలంగా తన్నిన వ్యక్తి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు

ఐతే జస్టిస్‌ అనూజ ప్రభు‌దే‌శాయ్‌ సదరు నిందితుడికి బెయిల్‌ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దం..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని వెల్లడి

HC on Sex After Marriage Promise: ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొని తర్వాత రేప్ కేసు పెడతానంటే కుదరదు, కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు