Cyclone Mocha: తీవ్ర తుపాన్‌గా మారిన మోచా, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ సరిహద్దు వద్ద తీరం దాటే అవకాశం, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు హై అలర్ట్

మోచా తుఫాన్(Cyclone Mocha) అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ భారీ ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. పశ్చిమ బెంగాల్‌లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి

Cyclone Mocha | Representational Image (Photo Credits: Pixabay)

మోచా తుఫాన్(Cyclone Mocha) అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ భారీ ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. పశ్చిమ బెంగాల్‌లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి. స్టాండ్‌బైలో మ‌రో 100 మంది రెస్క్యూ ద‌ళం ఉన్న‌ట్లు ఎన్డీఆర్ఎప్ సెకండ్ బెటాలియ‌న్ క‌మాండెంట్ గుర్మింద‌ర్ సింగ్ తెలిపారు. బెంగాల్ తీర ప్రాంతంలో ఇండియ‌న్ కోస్టు గార్డు ద‌ళం కూడా హై అల‌ర్ట్‌లో ఉంది.

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ బోర్డ‌ర్ వ‌ద్ద మోచా తుపాన్ తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గంట‌కు సుమారు 160 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీయ‌నున్నాయి. బంగ్లాదేశ్ కోక్స్ బ‌జార్ ప్రాంతంలో రెండు మీట‌ర్ల మేర వ‌ర్షం ప‌డే ఛాన్సు ఉంద‌ని ఐఎండీ చెప్పింది.బంగాళాఖాతంలో ఈశాన్యం దిశ‌గా వెళ్ల‌కూడ‌ద‌ని జాల‌ర్ల‌కు వెద‌ర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను

ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అల‌ర్ట్ జారీ చేశారు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. త్రిపుర‌, మీజోరంలో భారీ స్థాయిలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. నాగాలాండ్‌, మ‌ణిపూర్‌, సౌత్ అస్సాంలో స్వ‌ల్ప స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌నున్న‌ది. ఈసారి తుఫాన్‌కు మోచా అనే పేరును యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలో మోచా అనేది ఓ చిన్న గ్రామం. ఈ గ్రామం ఫిషింగ్ తో పాటు కాఫీ ఉత్ప‌త్తికి ప్రసిద్ధి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement