AP Weather Update: ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను
ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Vijayawada, May 12: ఏపీలో (AP) భిన్నమైన వాతావరణం (Mixed Weather) నెలకొంది. ఒకవైపు వర్షాలు (Rains), మరోవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం (Amaravathi Weather Department) తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
60 మండలాల్లో వడగాలులు
అనంతపురం జిల్లా శెట్టూరులో నిన్న అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నేడు రాష్ట్రంలోని 60 మండలాల్లో వడగాలులు వీచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అత్యంత తీవ్ర తుపానుగా మోచా
మోచా తుపాను ఈ నెల 14న ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన ‘మోచా’ గత రాత్రి తీవ్ర తుపానుగా మారింది. నేడు మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 12, 2023 08:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

