Vijayawada, May 28: సూర్యుడి (Sun) ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు (AP People) అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperatures) 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరులో అత్యధికంగా 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్
శనివారం తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి.