Dalit Man Thrashed: టాయిలెట్‌ సీటు దొంగిలించాడంటూ దళితుడికి శిక్ష, స్థంబానికి కట్టేసి చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత, గుండు కొట్టించి వీధుల్లో తిప్పిన కర్కశకులు, వైరల్‌ గా మారిన వీడియో..

దొంగ అనే ఆరోపణతో ఒక దళిత యువకుడిని (Dalit man) కట్టేసి విపరీతంగా కొట్టి, అతడి ముఖానికి నలుపు రంగు పూసి, గుండు గీసి ఊరంతా తింపారు. ఇంత చిత్రవధకు గురైన ఆ దళిత యువకుడి మీద వచ్చిన దొంగతనం ఆరోపణ ఏంటంటే.. బాత్రూంలో ఉండే సీటు చోరీ చేయడం.

screen garb from viral video

Lucknow, OCT 23: దొంగ అనే ఆరోపణతో ఒక దళిత యువకుడిని (Dalit man) కట్టేసి విపరీతంగా కొట్టి, అతడి ముఖానికి నలుపు రంగు పూసి, గుండు గీసి ఊరంతా తింపారు. ఇంత చిత్రవధకు గురైన ఆ దళిత యువకుడి మీద వచ్చిన దొంగతనం ఆరోపణ ఏంటంటే.. బాత్రూంలో ఉండే సీటు చోరీ చేయడం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ (Bahraich) జిల్లా హర్దిలో మంగళవారం జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ జనతా పార్టీకి (BJP) చెందిన స్థానిక నాయకులు రాధేశ్యామ్ మిశ్రా, అతడి ఇద్దరు సహాయకులు రాజేశ్ కుమార్(30) అనే వ్యక్తిని రోడ్డుపై ఉన్న ఒక పోలుకు కట్టేసి చితకబాదుతున్నారు. బాధితుడి ముఖం, తల మొత్తం నలుపు రంగులో (INK) నిండిపోయి ఏమాత్రం గుర్తు పట్టనంతగా మారిపోయింది.

అప్పటికే బాగా కొట్టారు కాబోలు.. నొప్పిని కూడా గ్రహించలేని స్థితిలోకి వెళ్లాడు. తమ ఇంట్లోని బాత్రూంలో సీటు ఎత్తుకెళ్లిన కారణంతో రాజేశ్‭ను ఇంతలా హింసించినట్లు వారు పేర్కొన్నారు.. కొద్ది సేపటికి రాజేశ్‭కిగుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. రాజేశ్ (Rajesh) రోజూ కూలీ పని చేసే వ్యక్తి. అతడిని కొడుతుంటే చుట్టూ గుమిగూడిన జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు.

Nurse Gang Rape: ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్న నర్సుపై గ్యాంగ్‌రేప్, చేతుల కట్టేసి రెండు గంటల పాటూ అత్యాచారం చేసిన దుండగులు, అకృత్యాన్ని ఫోన్‌లో రికార్డు చేసి బెదిరించిన మృగాళ్లు, ఆస్పత్రి సిబ్బంది దీపావళి సెలవులకు వెళ్లిన టైంలో ఘటన 

రాజేశ్‭ కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాధేశ్యామ్ మిశ్రా పరారీలో ఉన్నాడని, అతడి ఇద్దరు సహాయకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement