Arvind Kejriwal Faces Double Trouble: తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ‌రోసారి అరెస్ట్, బెయిల్ వ‌చ్చినా బ‌య‌టకు రాలేని ప‌రిస్థితి, ఈడీ కేసులో బెయిల్, సీబీఐ కేసులో మ‌ళ్లీ అరెస్ట్

మంగళవారం తీహార్ జైలులో (Tihar Jail) కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడి. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ ను (Kejriwal) సీబీఐ హాజరుపరచనుంది.

Arvind Kejriwal (Credits: X)

New Delhi, June 26: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో (CBI) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ (Kejriwal Arrest) అయ్యారు. ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తీహార్ జైలులో (Tihar Jail) కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడి. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు కేజ్రీవాల్ ను (Kejriwal) సీబీఐ హాజరుపరచనుంది. కేజ్రీవాల్ ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు.. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ట్రయల్ కోర్టులో కోరనున్నారు. ప్రస్తుతం ఈడీ కేసులో భాగంగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ.. అనంతరం వారం రోజుల తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఎన్నికల సందర్భంగా మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై విడుదలై, బెయిల్ ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి జూన్ 2న మధ్యాహ్నం తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.

 

ట్రయల్ కోర్టు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు గత గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో విచారణకు ముందే సీబీఐ కోర్టులో కేజ్రీవాల్ ను అధికారులు హాజరుపర్చనున్నారు. దీంతో ఈ కేసులో ఆయన్ను అధికారికంగా అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాల సమాచారం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Share Now
Advertisement