Delhi Metro New Guidelines: అయిదు నెలల తరువాత.. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్లు ప్రారంభం, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు (Delhi Metro New Guidelines) అన్‌లాక్‌-4 లో (Unlock 4) భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల (Delhi Metro) ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ కేసుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Delhi Metro | Representational Image (Photo Credits: PTI)

New Delhi, August 30: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు (Delhi Metro New Guidelines) అన్‌లాక్‌-4 లో (Unlock 4) భాగంగా సెప్టెంబర్‌ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల (Delhi Metro) ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ కేసుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

టోకెన్ల విధానాన్ని రద్దు చేసింది. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. అలాగే ప్రయాణికులు మాస్కులు, స్మార్ట్ కార్డులు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. నాలుగో విడత అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాల్లో మెట్రో సర్వీస్‌లను నడుపుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెట్రో రైళ్లను నడిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ తెలిపారు. సామాజిక దూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆదివారం మీడియాకు చెప్పారు. రైతులుంటేనే దేశం, కరోనా కాలంలో రైతులు పడుతున్న కష్టాన్ని కొనియాడిన ప్రధాని మోదీ, 68వ మనకీ బాత్‌ కార్యక్రమంలో జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్రధాని

ఎంట్రీ వద్దనే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి లోనికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్‌ కార్డులు, ఇతర డిజిటల్‌ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దాంతోపాటు లిఫ్టుల్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ

దానికి తగ్గట్టుగా స్టేషన్లలో మెట్రో రైలు నిలిచే సమయం పెంచుతామని తెలిపారు. కాగా, కోవిడ్‌​ నియంత్రణలో భాగంగా మార్చి నెలలో ఢిల్లీ సర్వీసుల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దాదాపు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఇక మెట్రో పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement