New Delhi, August 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ 68వ మనకీ బాత్ కార్యక్రమంలో (Mann Ki Baat) జాతి నుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని ప్రధాని (PM Narendra Modi) పిలుపునిచ్చారు. మనది అన్నదాతలను గౌరవించుకునే సంస్కృతి అని, మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలున్నాయని చెప్పారు. కరోనా సమయంలో కూడా మన రైతులు (Farmers) కష్టపడి సాగుచేస్తున్నారని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో గతేడాదికంటే ఎక్కువ సాగుచేస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి (Coronavirus) విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు.
ఖరీఫ్ పంటల సాగు గత సంవత్సరంతో పోలిస్తే ఏడుశాతం అధికంగా ఉందని తెలిపారు. ‘అన్నాన్ని ఇచ్చేవాడు.. రైతును పొగడాలి’ అని రుగ్వేదంలోని మంత్రాన్ని ప్రధాని గుర్తు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వరి 10శాతం ఎక్కువ, పప్పుధాన్యాలు 5 శాతం, పత్తి 3శాతం, ముతక ధాన్యం, వోట్స్, తృణధాన్యాలు 3శాతం, నూనె గింజలు 13 శాతం’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘నేను దేశ రైతులను అభినందిస్తున్నాను. ముందు వారి శ్రమకు నమస్కరిస్తున్నాను’ అన్నారు. కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్ వ్యవసాయంతో ముడిపడి ఉందని చెప్పారు. రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్
ప్రతిపండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలని సూచించారు. ఇది పండుగల సమయమని, ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకొంటున్నారని చెప్పారు. ఓనం పండుగ ఉత్సాహం ఇవాళ ప్రపంచం నలుమూలలకూ చేరిందని, కేరళ ఓనం పుండుగ ఇవాళ అంర్జాతీయ ఉత్సవంగా మారుతున్నదని తెలిపారు. ఓనం పండుగ చింగమ్ నెలలో వస్తుందని, పండుగ సందర్భంగా ప్రజలు కొత్తవస్తువులు కొనుగోలు చేస్తారని, ఇళ్లను అలంకరించుకుంటారని చెప్పారు. పుల్కమ్ తయారుచేసుకుని పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాని తెలిపారు.
ఇక పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారుచేయాలని పిలుపునిచ్చారు. బొమ్మల తయారీకి యువత ముందుకు రావాలని సూచించారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలనన్నారు. మన కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కొండపల్లి చెక్కబొమ్మలకు మంచిపేరు ఉన్నదని చెప్పారు. బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
గత నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు.
సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని, కోవిడ్ సమయంలో ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం వీరు టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా మారుతున్నారని ప్రశంసించారు. అదే విధంగా కుక్కలు మన జీవితాల్లో గొప్ప పాత్ర పోషిస్తున్నాయన్నారు. భారత సైన్యం, క్రీడలు తదితర రంగాల్లో కుక్కలు మనకు సాయపడుతున్నాయన్నారు. కోవిడ్ కాలంలో ప్రజలు ఒకరికొకరు రెండు గజాల దూరం పాటించడం తప్పనిసరి అని, అదేవిధంగా మాస్క్‌ను ధరించడం తప్పనిసరి అని చెప్పారు.