Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!
రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు ఏక్‌నాథ్ షిండే. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే కేర్ టేకర్ సీఎంగా కొనసాగనున్నారు.
Hyd, Nov 26: మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు ఏక్‌నాథ్ షిండే. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే కేర్ టేకర్ సీఎంగా కొనసాగనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288 స్థానాలకు గాను 235 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ 149 సీట్లల్లో పోటీ చేసి132 చోట్ల విజయం సాధించగా షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు గెలుచుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు
Here's Video:
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. సీఎం పదవికి సంబంధించి ముంబైలో పలు దఫాలుగా చర్చలు జరిగినా ఎవరు ఒక క్లారిటీకి రాలేకపోయారు. ఫడ్నవీస్ వర్సెస్ షిండే మధ్య సీఎం పదవి కోసం దోబుచులాట జరుగుతోంది.
ఈ కీలక సమయంలో సంచలన తనను కలవడానికి రావొద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఏక్‌నాథ్ షిండే. తన ఇంటి ముందు హడావిడి చేయొద్దంటూ నేతలకు సూచించారు. అయితే కూటమిలో ఎక్కువ సీట్లు గెలుపొందిన బీజేపీకే సీఎం పదవి దక్కుతుందని తెలుస్తోండగా ఫడనవీస్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.