Fali Nariman & Ameen Sayani Dies: ఇద్దరు దిగ్గజాలను కోల్పోయిన భారత్, అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌, ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు

Fali Nariman & Ameen Sayani Dies (Photo-X/@sanjayuvacha)

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.  ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత, వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు..

ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ (Iconic Radio Presenter) అమీన్ సయానీ (Ameen Sayani) తన 91 ఏళ్ళ వయసులో కన్ను మూశారు. మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు (heart attack) గురైన అమీన్‌ను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత, బినాకా గీత్‌ మాలతో పాపులర్ అయిన రేడియో మాస్ట్రో

ఈ విషయాన్ని ఆయన కుమారుడు రజిల్‌ సయానీ (Rajil Sayani) ధృవీకరించారు. 1952 నుంచి 1994 వరకు రేడియోలో సుదీర్ఘంగా సాగిన ‘బినాకా గీత్‌ మాల’ (Binaca Geet Mala) ఆయనకు పేరొచ్చింది. 54,000 రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇద్దరి మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Share Now
Advertisement