ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)