ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ (Iconic Radio Presenter) అమీన్ సయానీ (Ameen Sayani) తన 91 ఏళ్ళ వయసులో కన్ను మూశారు. మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు (heart attack) గురైన అమీన్‌ను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రజిల్‌ సయానీ (Rajil Sayani) ధృవీకరించారు. 1952 నుంచి 1994 వరకు రేడియోలో సుదీర్ఘంగా సాగిన ‘బినాకా గీత్‌ మాల’ (Binaca Geet Mala) ఆయనకు పేరొచ్చింది. 54,000 రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)