Fear of Coronavirus: కరోనా సోకిందేమోనన్న భయంతో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ భవనం మీద నుంచి కిందకు దూకేసిన 60 ఏళ్ల వృద్ధుడు, తలపగిలి అక్కడికక్కడే మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అయితే ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి ఉండటం.....

Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, May 2: కరోనావైరస్ ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా కొంతమంది ప్రాణాలను బలితీసుకుంటుంది. ఈ బారినపడి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతుంటే, మరికొంత తిండి దొరకక, ఇంకొంత 'మందు' దొరకక మరియు ఇతరత్రా కారణాలచే చనిపోతున్నారు. హైదరాబాద్ లోని, రామాంతపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనకు కోవిడ్-19 సోకిందేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం, రామాంతపూర్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ 60 ఏళ్ల వృద్ధుడు కొంతకాలం నుంచి ఉబ్బసం సహా ఉబ్బసం సహా ఇతర గ్యాస్ట్రిక్ సంబంధమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి ఉండటం మరియు తనకు ఆయాసం కూడా ఎక్కువవడంతో తనకూ కరోనావైరస్ సోకిందేమోనన్న భయాందోళనలకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతణ్ని నగరంలోని కింగ్ కోఠి ఆసుపత్రికి చెకప్ కోసం తీసుకెళ్లగా, కరోనా లక్షణాలేమి లేవని చెప్పారు. అయితే అనుమానం ఉంటే గాంధీకి వెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు.  నాందేడ్ నుంచి వచ్చిన 137 యాత్రికులకు కరోనావైరస్ పాజిటివ్ రిజల్ట్స్

అయితే అప్పట్నించి ఆ వ్యక్తికి భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఈరోజు చెకప్ కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమవగా మరింత డిప్రెషెన్ లోకి వెళ్లి పోయాడు. ఇదే క్రమంలో అతడు నివసించే అపార్ట్‌మెంట్ భవనం బాల్కనీ పైనుంచి దూకేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.