IPL Auction 2025 Live

FIR against Sundar Pichai: గూగూల్ సీఈవోపై కాపీ రైట్ కేసు, అనుమతి లేకుండా నా సినిమా యూట్యూబ్‌ లో పెట్టారంటూ రచ్చకెక్కిన నిర్మాత, అదొక బీగ్రేడ్ సినిమా అంటూ నెటిజన్ల విసుర్లు

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్‌(YouTube) ఓనర్‌ కంపెనీ అయిన ‘గూగుల్‌’ ప్రతినిధుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు అయ్యింది.

Google CEO Sundar Pichai (Photo Credits: IANS)

Mumbai, January 26: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai)పై పోలీస్‌ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌ (Sundar Pichai)తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌(FIR against Sundar Pichai) నమోదు చేశారు. కాపీరైట్‌ యాక్ట్‌ వయొలేషన్‌ (Copyright Act violation ) కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

‘ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ (Ek Haseena Thi Ek Deewana Tha)అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్‌, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ (Sunil darshan) కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్‌(YouTube) ఓనర్‌ కంపెనీ అయిన ‘గూగుల్‌’ ప్రతినిధుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌(YouTube)లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్‌ చెప్తున్నారు. ఇల్లీగల్‌ అప్‌లోడింగ్‌(Illegal uploading) విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు.

RRB Exam Protest: బీహార్ రాష్ట్రంలో రైల్వే పరీక్షలో అక్రమాలు, రైలుకు నిప్పు పెట్టిన ఆందోళన కారులు

ఇదిలా ఉంటే ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా (Ek Haseena Thi Ek Deewana Tha) 2017లో రిలీజ్‌ అయ్యింది. రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామాగా ప్రమోట్‌ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అదొక బీ గ్రేడ్‌ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్‌ పురస్కారం గౌరవం దక్కింది.



సంబంధిత వార్తలు

Car Falls From Under Construction Bridge: గూగుల్ మ్యాప్ ను న‌మ్మి ప్రాణాలు పోగొట్టుకున్న ముగ్గురు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీద నుంచి ప‌డిపోయిన కారు

Complaint Against Ram Charan: అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు