Fuel Price Hike: తగ్గేది లేదంటున్న పెట్రోలు ధరలు, తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంపు, మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి, హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోలు ధర

శంలో ఇంధన ధరల పెంపు అలాగే కొనసాగుతోంది. చమురు కంపెనీలు శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు (Fuel Price Hike) పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది.

Petrol Pump (Photo Credits: PTI)

New Delhi, June 26: దేశంలో ఇంధన ధరల పెంపు అలాగే కొనసాగుతోంది. చమురు కంపెనీలు శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు (Fuel Price Hike) పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది. కాగా మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ( Petrol, Diesel Prices Rise by Sharp 35 Paise per Litre) ఇది 31వ సారి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.104 దాటింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.10.22కు పెరగ్గా.. డీజిల్‌ రూ.96.16కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది.

మరో వైపు అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్‌ రూ.101.85కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్‌ పెరగ్గా అది మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటగా.. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.

దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, కొత్తగా 48,698 మందికి కరోనా, 24 గంట‌ల్లో 64,818 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం 5,95,565 కోవిడ్ యాక్టివ్ కేసులు, డెల్టా ప్ల‌స్ వేరియంట్‌పై వారంలో వ్యాక్సిన్ సామ‌ర్ధ్యం తేల‌నుందని తెలిపిన ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల్‌రాం భార్గ‌వ

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఓ సారి పరిశీలిస్తే..

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.101.96.. డీజిల్‌ రూ.96.63

ఢిల్లీ: పెట్రోల్‌ రూ.98.11.. డీజిల్‌ రూ.88.65

ముంబై: పెట్రోల్‌ రూ.104.22.. డీజిల్‌ రూ.96.16

చెన్నై: పెట్రోల్‌ రూ.99.18.. డీజిల్‌ రూ.93.22

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.97.99, డీజిల్‌ రూ.91.49

విజయవాడ: పెట్రోల్‌ రూ.104.31, డీజిల్‌ రూ.98.38

భోపాల్‌: పెట్రోల్‌ రూ.106.35.. డీజిల్‌ రూ.97.37

బెంగళూరు: పెట్రోల్‌ రూ.101.39, డీజిల్‌ రూ.93.98

పాట్నా: పెట్రోల్‌ రూ.100.13.. డీజిల్‌ రూ.94

చండీగఢ్‌: పెట్రోల్‌ రూ.94.35, డీజిల్‌ రూ.88.29

లక్నో: పెట్రోల్‌ రూ.95.29, డీజిల్‌ రూ.89.06

రాంచీ: పెట్రోల్‌ రూ.93.82, డీజిల్‌ రూ.93.57

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement