Coronavirus Threat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలు సహా దేశవ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి జాబితా చూడండి

రాష్ట్రాల వారిగా ఏయే నగరాలలో వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయో తెలిపే జాబితా....

Coronavirus Outbreak in India | PTI Photo

New Delhi, March 9:  భారతదేశంలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 52 వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలో సోమవారం మరో మూడు కొరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ 43 కు చేరుకుంది. ఆదివారం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు మొత్తంగా నాలుగు కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎగువన జమ్మూకాశ్మీర్ నుంచి దిగువన కేరళ వరకు బాధితులు ఉన్నారు. కేరళలోని ఎర్నాకుళం నుంచి ఒకరు, దిల్లీ నుంచి ఒకరు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఒకరు మరియు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక మహిళ ఉన్నారు. వీరంతా ఇటీవల విదేశీ పర్యటనలకు వెళ్లివచ్చిన వారేనని సమాచారం.

కాగా, ఈ 43 మంది కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో తొలి మూడు కేసులు కేరళ నుంచి నమోదైనవి, గత ఫిబ్రవరి నెలలో చైనా నుంచి కేరళ వచ్చిన ఆ ముగ్గురు చికిత్స తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారి కరోనావైరస్ బాధితులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని విమానాశ్రయాలలో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతీ ప్రయాణికుడికి అక్కడికక్కడే స్క్రీనింగ్ చేసి, లక్షణాలు కనిపించిన వారందరినీ వైరస్ నిర్ధారణ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అలా ఇప్పటివరకు 8,255 విమానాల నుండి మొత్తం 8,74,708 అంతర్జాతీయ ప్రయాణీకులను విమానాశ్రయాలలో పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో వ్యాధి లక్షణాలు కనిపించిన వారు 1,921 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 177 మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరారు, వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. మరో 33,599 మంది ప్రయాణికులు పరిశీలనలో ఉండగా 21,867 మంది ప్రయాణికులు వారి పరిశీలన వ్యవధిని పూర్తి చేసుకున్నారు.  తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు-దగ్గుతో శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారిగా ఏయే నగరాలలో వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయో తెలిపే జాబితా కింద ఇవ్వబడింది.

Full List of Coronavirus Testing Centres in India:

52 testing sites for COVID ‐19
State/UT LIST OF VRDLs
Andhra Pradesh 1 Sri Venkateswara Institute of Medical Sciences, Tirupati
2 Andhra Medical College, Visakhapatnam, Andhra Pradesh
3 GMC, Anantapur, AP
Andaman & Nicobar islands 4 Regional Medical Research Centre, Port Blair, Andaman and Nicobar
Assam 5 Gauhati Medical College, Guwahati
6 Regional Medical Research Center, Dibrugarh
Bihar 7 Rajendra Memorial Research Institute of Medical Sciences, Patna
Chandigarh 8 Post Graduate Institute of Medical Education & Research, Chandigarh
Chhattisgarh 9 All India Institute Medical Sciences, Raipur
Delhi-NCT 10 All India Institute Medical Sciences, Delhi
11 National Centre for Disease Control, Delhi
Gujarat 12 BJ Medical College, Ahmedabad
13 M.P.Shah Government Medical College, Jamnagar
14 Pt. B.D. Sharma Post Graduate Inst. of Med. Sciences, Rohtak, Haryana
Haryana 15 BPS Govt Medical College, Sonipat
Himachal Pradesh 16 Indira Gandhi Medical College, Shimla, Himachal Pradesh
17 Dr.Rajendra Prasad Govt. Med. College, Kangra, Tanda, HP
Jammu and Kashmir 18 Sher‐e‐ Kashmir Institute of Medical Sciences, Srinagar
19 Government Medical College, Jammu
Jharkhand 20 MGM Medical College, Jamshedpur
Karnataka 21 Bangalore Medical College & Research Institute, Bangalore
22 National Institute of Virology Field Unit Bangalore
23 Mysore Medical College & Research Institute, Mysore
24 Hassan Inst. of Med. Sciences, Hassan, Karnataka
25 Shimoga Inst. of Med. Sciences, Shivamogga, Karnataka
Kerala 26 National Institute of Virology Field Unit, Kerala
27 Govt. Medical College, Thiruvananthapuram, Kerala
28 Govt. Medical College, Kozhikode, Kerala
Madhya Pradesh 29 All India Institute Medical Sciences, Bhopal
30 National Institute of Research in Tribal Health (NIRTH), Jabalpur
Meghalaya 31 NEIGRI of Health and Medical Sciences, Shillong, Meghalaya
Maharashtra 32 Indira Gandhi Government Medical College, Nagpur
33 Kasturba Hospital for Infectious Diseases, Mumbai
Manipur 34 J N Inst. of Med. Sciences Hospital, Imphal‐East, Manipur
Odisha 35 Regional Medical Research Center, Bhubaneswar
Puducherry 36 Jawaharlal Institute of Postgraduate Medical Education & Research, Puducherry
Punjab 37 Government Medical College, Patiala, Punjab
38 Government Medical College, Amritsar
Rajasthan 39 Sawai Man Singh, Jaipur
40 Dr. S.N Medical College, Jodhpur
41 Jhalawar Medical College, Jhalawar, Rajasthan
42 SP Med. College, Bikaner, Rajasthan
Tamil Nadu 43 King's Institute of Preventive Medicine & Research, Chennai
44 Government Medical College, Theni
Tripura 45 Government Medical College, Agartala
Telangana 46 Gandhi Medical College, Secunderabad
Uttar Pradesh 47 King's George Medical University, Lucknow
48 Institute of Medical Sciences, Banaras Hindu University, Varanasi
49 Jawaharlal Nehru Medical College, Aligarh
Uttarakhand 50 Government Medical College, Haldwani
West Bengal 51 National Institute of Cholera and Enteric Diseases, Kolkata
52 IPGMER, Kolkata

విదేశాల నుంచి వచ్చిన వారు లేదా విదేశీ ప్రయాణాలు చేసి భారత్ వచ్చిన ప్రయాణికులందరూ తమ యాత్ర వివరాలను మరియు తమ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను 'సెల్ఫ్ డెక్లరేషన్' పత్రాలలో సమగ్రంగా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ఆన్ని రాష్ట్రాలు మరియు యూటీలలో కరోనావైరస్ స్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్ వర్ధన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif