IPL Auction 2025 Live

Gujarat Shocker: ముఖేష్ అంబానీ కొడుకునంటూ మహిళతో ఛాటింగ్, నగ్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్, రూ. 25 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలు

గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన (Gujarat Shocker) వెలుగులోకి వచ్చింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Gandhi Nagar, Jan 3: ఒరిస్సాకు చెందిన సచిన్ హల్వాయి అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఆకాష్ అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ (Akash Ambani's fake ID)చేసి..మహిళ నుంచి (trap for a woman) భారీ మొత్తంలో వసూలు చేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన (Gujarat Shocker) వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు వెసు ప్రాంతంలో ప్రీ స్కూల్‌ నడుపుతోంది. 2016లో సచిన్ హల్వాయ్ వేసులో నివసిస్తున్న 40 ఏళ్ల మహిళకికి, నర్సరీ స్కూల్‌లోని డైరెక్టర్‌కి ఆకాష్ అంబానీ పేరుతో ఫేక్ ఐడీని ఉపయోగించి ఆకాష్ అంబానీ ఇల్లు, క్రికెట్ మ్యాచ్ ఫొటోలను పంపాడు. ఆకాష్ అంబానీ ఫోటో చూసిన తర్వాత, ఆ అమ్మాయి ఆకాష్ అంబానీ అని భావించి అతనికి సందేశం పంపింది. తన lనగ్న ఫోటోను కూడా పంపింది.

ప్రియుడు మోజులో మైనర్ కిరాతకం, ప్రేమకు అడ్డుగా ఉందని కన్నతల్లిని దారుణంగా పొడిచి చంపేసిన కూతురు, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన

అయితే, ఐపీఎల్‌ బెట్టింగ్‌లో కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నానని ‘ఫేక్‌ ఆకాశ్‌ అంబానీ’ ఆమెకు ఫోన్‌ చేసి చెప్పాడు. కొంత నగదు పంపించాలంటూ అడిగాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. విడతలవారీగా రూ.25 లక్షలను అతడి ఖాతాలో వేసింది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఆకాశ్‌ స్నేహితుడినంటూ సచిన్‌ హాల్వాయ్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. సూరత్‌లో స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టేందుకు తమకు రూ.50 లక్షలు కావాలని డబ్బు అడిగాడు.

షాకింగ్ వీడియో, బైకర్‌ను వెంబండించి కత్తితో పొడిచి చంపిన ఆరుమంది మైనర్లు, సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్

అనుమానం వచ్చిన బాధితురాలు సచిన్‌తో మాట్లాడటం మానేసింది. అంతకుముందు మహిళ పంపించిన నగ్న ఫొటోలను ఆసరాగా చేసుకున్న సచిన్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించాడు. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



సంబంధిత వార్తలు