Representational Image (Photo Credits: File Photo)

Hyderabad, FEB 28: ప్రజారోగ్యానికి హాని కలిగించే రసాయనాల సమ్మేళనంతో అనుమతులు లేకుండా మౌత్ వాష్‌ను (Fake Mouth Wash) తయారు చేస్తున్న కేంద్రంపై సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. చుడీ బజార్ ప్రాంతానికి చెందిన కిశోర్ ఓజా (57)స్థానికంగా నివసిస్తూ మార్కెట్‌లో డిమాండ్ కలిగిన మౌత్ ప్రెషనర్‌ను అనధికారికంగా తయారు చేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని షాపులకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తయారీ విధానంలో ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లోపాలను సైతం అధిగమిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్‌ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు 

కిశోర్ ఓజా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా తన ఉత్పత్తులను అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించిన సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చుడి బజార్‌లోని ముఖ్ వాసి మౌత్ వాష్ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సరఫరాకు సిద్ధంగా ఉన్న లక్ష 20వేల రూపాయల విలువ కలిగిన సరుకును గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో 14వ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆధికారితో పాటు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాల స్వామి, ఎస్‌ఐ ఎస్.సాయికిరణ్ తదితరులు ఉన్నారు.