Fake News On Maha Kumbh Mela UP Government Takes Action Against 53 Social Media Accounts.. here are the details(X)

Delhi, Feb 15:   ఆధ్మాత్మిక సంరంభం మహా కుంభమేళాకు(Maha Kumbh Mela 2025) భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం( UP Government ) ప్రకటించింది. ఇక ఈ నెల 26 శివరాత్రితో మహాకుంభమేళా ముగియనుంది.

ఇక కుంభమేళా గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న 53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై(Social Media Accounts) యూపీ సర్కార్ కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే 15 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు లీగల్ నోటీసులు అందించింది. పాత వీడియోలు, తప్పుడు వార్తలు, మత ఘర్షణలు చెలరేగా విధంగా కొన్ని మీడియా సంస్థలు పోస్టులు పెట్టినట్లు సమాచారం.

మహాకుంభ గురించి ఫేక్ న్యూస్‌ను(Spreading Fake News) అరికట్టేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. యూపీ పోలీసులు సైబర్ నిపుణుల సహాయంతో తప్పుదోవ పట్టించే పోస్టులు, పుకార్లను గుర్తించి చర్యలు తీసుకున్నారు.

మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు

2025 ఫిబ్రవరి 13న రెండు ఫేక్ వీడియోలను పోస్ట్ చేసినట్లు గుర్తించారు. మొదటి వీడియో మహాకుంభ బస్ స్టాండ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు చూపించింది, కానీ నిజానికి అది 2020లో కైరోలో జరిగిన పైప్‌లైన్ అగ్నిప్రమాదానికి సంబంధించినదిగా తేలింది.

ఇక రెండో వీడియో 2024 నవంబరులో పాట్నాలో జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్ దృశ్యాలను మహాకుంభ ఘటనగా తప్పుగా ప్రచారం చేశారు9Fake News on Maha Kumbh Mela). తప్పుడు అగ్నిప్రమాద వీడియోను షేర్ చేసిన ఏడు సోషల్ మీడియా ఖాతాదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.