![](https://test1.latestly.com/wp-content/uploads/2023/11/Crime.jpg?width=380&height=214)
Newdelhi, Feb 15: మహా కుంభమేళాలో (Maha Kumbhmela) పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న వారి కలలు కల్లలుగా మారాయి. రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో వారిని మృత్యువు కబళించింది. పూర్తి వివరాల్లోకివెళ్తే, ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్-ప్రయాగ్ రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలెరో వాహనాలు పరసపరం ఢీకొన్నాయి. ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వెళ్తున్న క్రమంలో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులందరూ ఛత్తీస్ గఢ్ కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ప్రమాదం నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం.. 10మంది మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా… pic.twitter.com/rJVsleCocR
— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025
మొన్న హైదరాబాద్ వాసులు
ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వెళ్లి తిరుగుపయనమైన హైదరాబాద్ ఏడుగురు యాత్రికులు గతవారం రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడటం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ వద్ద మృతులు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. మృతులు నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.