Newyork, Feb 15: బోట్ (Boat) మీద సరదాగా సముద్రంలోపలి వెళ్లిన తండ్రి కొడుకులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. కన్నతండ్రి ముందే చెట్టంత కొడుకును ఓ భారీ తిమింగలం అమాంతం (Whale Swallows) మింగేసింది. పటగోనియా సముద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డేల్, ఆడ్రియన్లు తండ్రీ, కొడుకులు. వెళ్లారు. సరదాగా సముద్రంలోకి వెళ్లి బోటింగ్ చేయాలనుకున్నారు. తండ్రి డేల్ ఒక బోటులో వీడియో తీస్తుండగా కొడుకు ఆడ్రియన్ మరో బోట్ లో బోటింగ్ చేస్తున్నాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకొంటూ ఉండగానే ఇంతలో ఒక భారీ తిమింగలం కొడుకును బోట్ తో సహా మింగేసింది. డేల్ చూస్తుండగానే చెట్టంత కొడుకు మాయమైపోయాడు. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.
Here's Video:
యువకుడిని నోటకరచి వదిలిపెట్టిన తిమింగలం..
సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకరచి వదిలేసింది. చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆడ్రియన్ సిమన్కాన్(20), తన తండ్రి డెల్ కలిసి వేర్వేరు పడవల్లో సముద్రంలోకి… pic.twitter.com/INvK7Qfmku
— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2025
అసలు ట్విస్ట్ ఇదే
ఆడ్రియన్ ను బోటుతో సహా మింగేసిన తిమింగలానికి ఏమన్పించిందో ఏమో కానీ.. వెంటనే సెకన్ ల వ్యవధిలో ఆ తిమింగలం ఆడ్రియన్ ను బోట్ తో సహా బైటకు కక్కేసింది. దీంతో తేరుకున్న ఆడ్రియన్ బతుకుజీవుడా అనుకుంటూ వెంటనే స్పీడ్ గా బోట్ నడిపిస్తూ తండ్రి వద్దకు చేరుకున్నాడు. తండ్రి కూడా కొడుకుకు ధైర్యం చెబుతూ.. అక్కడి నుంచి వెంటనే ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.