
Bhopal, April 6: మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ (Sister swallows mobile phone ) మొత్తాన్ని మింగేసింది.18 ఏళ్ల యువతికి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ (fight with brother) మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది.
చైనా ఫోన్‌ను తీసుకుని ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్‌ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్‌లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు.
వెంటనే వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.