Newdelhi, June 10: కనిపించకుండా పోయిన ఓ మహిళ (Women) మూడు రోజుల తర్వాత ఒక కొండచిలువ (Python Swallows Women) పొట్టలో విగత జీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులాసి ప్రావిన్స్ లో వెలుగుచూసింది. కలెంపాగ్ గ్రామానికి చెందిన ఫరీదా(45) మంగళవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబీకులు, గ్రామస్తులు అందరూ.. వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె భర్త, స్థానికులు ఓ అడవిలో ఫరీదాకు చెందిన వస్తువులు గుర్తించారు.
Missing Indonesian woman found dead inside 16-foot-long python after 3 days https://t.co/pBtj206VZs
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) June 9, 2024
ఆ వస్తువుల సమీపంలోనే..
ఆ వస్తువుల సమీపంలోనే 5 మీటర్ల పొడవున్న ఒక కొండచిలువ పెద్ద కడుపుతో వారికి కనిపించింది. అనుమానం వచ్చి దాన్ని కోసి చూడగా వేసుకున్న దుస్తులతో సహా ఫరీదా వారికి కనిపించింది. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.