New Delhi, June 09: నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా (PM Modi) ప్రమాణస్వీకారం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం (Modi Oath) చేసి రికార్డు సృష్టించారు మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులతోపాటు పలువురు విదేశీ ప్రముఖులు కూడా వచ్చారు. బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా(Amith Shah), నితిన్ గడ్కరీ, జై శంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్‌సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్, మన్‌సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు.. నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నారు. వారితోపాటు కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి సీనియర్ కూడా ఈ సారి అవకాశం దక్కింది.
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
ఆయనతో పాటే అర్జున్ మేఘవాల్, మనోహర్‌లాల్ ఖట్టర్, రావు ఇంద్రజీత్ సింగ్, కమల్‌జీత్ సెహ్రవాత్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురుగన్, ప్రహ్లాద్ జోషి, శోభా కరాంద్లజె, నిముబెన్ బంబానియా, జుయెల్ ఓరం తదితర నేతలకు కూడా మోదీ మంత్రివర్గంలో బెర్త్ దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, బీజేపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు మంత్రివర్గం బెర్త్ ఖరారైంది. తెలంగాణలో బీజేపీ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని ఈ సారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మిత్రపక్ష నేతల్లో హెచ్‌డీ కుమార స్వామి (జేడీఎస్), చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ), లలన్‌సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), జితన్ రామ్ మాంఝీ (హెచ్‌ఏఎమ్), జయంత్ చౌధరి (ఆర్‌ఎల్డీ), అనుప్రియా పటేల్, ప్రతాప్ రావు జాదవ్ (శివసేన – శిండే), రామ్‌దాస్ అథవాలె (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.