Hyderabad, June 10: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు (Heavy Rains) కురియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పలు ప్రాంతలకి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటు ఏపీలోనూ..
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ తెలిపింది.