 
                                                                 Newyork, June 10: అది అమెరికాలోని (America) ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ (Order) ఇచ్చాడు. ఇంతలో ఆ పెద్దాయనకు హఠాత్తుగా పెద్ద పెట్టున తుమ్ము వచ్చింది. ఇక ఏం చేస్తాడు. తుమ్మాడు. అయితే, కొద్ది సేపటికి అతని పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ వెంటనే నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక అతను విలవిల్లాడాడు. పెనిమిటీకి ఏమైందని భార్య పరిశీలించి చూడగా..అతడి పొట్ట భాగం నుంచి పేగులు బయటకు పొడుచుకుని రావటం కనిపించింది. ఆందోళనకు గురైన ఆమె వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి.. తన భర్తను దవాఖానకు తరలించింది.
#ItsViral | After the man sneezed, he felt a sharp pain in his body. Once, he lifted his shirt, he saw several inches of his colon poked out of surgical wound.
More details here: https://t.co/BRfYSaTGbq
— Hindustan Times (@htTweets) June 9, 2024
ఎందుకు ఇలా??
పెద్దాయన కేసును చూసి వైద్యులు సైతం షాక్ తిన్నారు. అయితే, గతంలో అతడికి ఉదరభాగంలో సర్జరీ జరిగిందని, పెద్ద పెట్టున వచ్చిన తుమ్ము కారణంగానే పేగులు బయటకు వచ్చి వుండవచ్చునని వైద్యులు అంచనావేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
