Bengaluru, April 6: కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంతో ఓ కుటుంబంలో దారుణ హత్య జరిగింది. కర్ణాటకలో ఈ దారుణం వెలుగుచూసింది. దక్షిణ కన్నడ జిల్లాలో షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో నివసిస్తుంటాడు. మంగళవారం ఇంట్లో వండిన కోడి కూర మొత్తాన్ని షీనా తినేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్‌కు విషయం తెలిసి తండ్రితో గొడవపడ్డాడు.
ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతను తెల్లవారుజామున 2:30 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడు బాగా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శివరామ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక 2021లో 30 ఏళ్ల వ్యక్తి తనకు చికెన్ కూర తయారు చేయలేదని భార్యను చంపిన సంఘటన జరిగింది. తాను అడిగిన వంటకం తన భార్య వండలేదని ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.నేను ఇంటికి వచ్చినప్పుడు, చికెన్ ఫ్రై లేకపోవడం చూసి నిరాశ చెందాను. నేను నా భార్యను అడిగినప్పుడు, ఆమె గర్వంగా సమాధానం చెప్పింది అందుకే కోపంతో, నేను చెక్క దుంగతో ఆమె తల పగులగొట్టాను. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి, అర్ధరాత్రి తీసుకెళ్లి, ఆమె మృతదేహాన్ని సరస్సులోకి విసిరానని పోలీసులకు నిందితుడు తెలిపాడు.