Stabbed (file image)

Chennai, April 5: తమిళనాడు పుడుక్కొట్టాయ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు తన ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలాను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. మృతుడిని జయంత్ గా గుర్తించిన పోలీసులు కిరాతకంగా హత్య చేసిన ప్రియురాలిని భాగ్యలక్ష‍్మిగా(38) గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుని విడిపోయిన భాగ్యలక్ష‍్మి సెక్స్ వర్కర్‌గా పనిచేసేది. 2020 మే నెలలో జయంతన్‌ ఆమెను ఓ లాడ్జిలో కలిశాడు. ఆ తర్వాత ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఆమెను గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టాడు. అయితే 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు.

పుడుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష‍్మి జయంతన్‌ను మార్చి 19న ఇంటికి రావాలని పిలిచింది. దీంతో అతను వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే తన స్నేహితుడు శంకర్‌కు ఫోన్ చేసింది భాగ్యలక్షి. అతను మరో ఇద్దరిని వెంటపెట్టుకుని వచ్చాడు. అనంతరం నలుగురూ కలిసి మార్చి 20 తెల్లవారుజామున జయంతన్‌ను దారుణంగా హత్య చేశారు.

తాగుబోతు భర్తకు 11 మంది భార్యలు, వాళ్లు వదిలేయడంతో నలుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్న ఘనుడు, తాగొచ్చి చివరకు ఆమెను కూడా చంపేశాడు

ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఇంటికి తిరిగివెళ్లారు. ఇంట్లో ఇంకా మిగిలిన శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్‌ బుక్ చేసుకుని మళ్లీ చెన్నై వెళ్లింది భాగ్యలక్ష‍్మి. వీటిని కూడా కోవలంలో పాతిపెట్టింది. అనంతరం తిరిగి పుడుక్కొట్టాయ్‌ చేరుకుంది.

మూడు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జయంతన్‌ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళ్తానని తన సోదరి జెయకృభ (41)కు ఫోన్‌లో చెప్పాడు. అయితే రెండు రోజులైనా ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడు అతని జాడ కనుగొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు హత్య విషయం తెలిసింది.భాగ్యలక్ష‍్మితో జయంతన్ తరచూ ఫోన్‌లో మాట్లాడున్నట్లు కాల్ రికార్డులో వెళ్లడైంది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి.ఈ ఘటనలో భాగ్యలక్ష‍్మికి మరో ముగ్గురు పురుషులు సహకరించారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.