Haryana Shocker: కూర బాలేదన్న భర్త, కోపంతో రాడ్‌తో అతని తల పగలగొట్టిన భార్య, హర్యానాలో దారుణ ఘటన, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

కూర సరిగా వండలేదని భార్యను అడిగినందుకు ఈ భార్య ఏకంగా తన భర్త తలను (Wife blew husband’s head) పగులకొట్టింది. హరియాణాలోని హిసార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో దినేశ్, బిందియా దంపతులు నివసిస్తున్నారు.

Representational Image | (Photo Credits: IANS)

Hisar, Sep 8: కూర సరిగా వండలేదని భార్యను అడిగినందుకు ఈ భార్య ఏకంగా తన భర్త తలను (Wife blew husband’s head) పగులకొట్టింది. హరియాణాలోని హిసార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో దినేశ్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజులాగే భర్త కోసం ఆహారం సిద్ధం చేసింది బిందియా. అయితే కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్(40).. ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు.

భోజనం అంత రుచిగా (telling food tasteless) లేదన్నాడు. దీంతో వారిమధ్య వాదన మొదలైంది. దీంతో కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్‌పై ఇనుప రాడ్డుతో దాడిచేసింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆ గొడవను గమనించిన పొరుగింటి వ్యక్తి అక్కడకు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం ఈ ఘటనపై దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ మధ్య తరచూ ఇలాంటి గొడవలే జరుగుతున్నాయని ఆ బాధిత భర్త చెప్పుకొచ్చాడు.

ఇదో రకం మోసం, ఎన్ఆర్ఐ యువతినంటూ అమ్మాయిలతో ఛాటింగ్, న్యూడ్ ఫోటోలు పంపాలని బ్లాక్ మెయిల్, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

అయితే బిండియాకు మూర్ఛ ఉందని మరియు మానసిక సమస్య కూడా ఉందని భర్తకు తర్వాత తెలిసింది. చాలా కాలం పాటు ఆమెకు దీనిపై చికిత్స కూడా చేయిస్తూ వస్తున్నాడు. చికిత్స నుండి పూర్తిగా ఉపశమనం కలగకపోవడం వల్ల ఆమె తరుచూ భర్తపై కోపం తెచ్చుకునేది. అతనిపై దాడి చేసేది. ఇంటి పనులు కూడా సరిగా చేసేది కాదని అతను వాపోయాడు. రోజు లాగే మొన్న కూడా అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కూరలో ఉప్పు బదులుగా చక్కెర వేసింది. దీంతో అతను ఎందుకు ఇలా అని అడిగినందుకు రాడ్ తో దాడి చేసిందని పోలీసులకు ఆ భర్త తెలిపారు. పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement