Hindenburg Research: హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్

హిండెన్‌బర్గ్ తాజా నివేదిక (Hindenburg Research) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటే (Supriya) అన్నారు. ఈ కుంభకోణంలో అదానీ ప్రమేయం ఉన్నందునే అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపడం లేదా అని ఆమె ప్రశ్నించారు

Hindenburg Research and SEBI (File Photo)

New Delhi, AUG 11: హిండెన్‌బర్గ్ తాజా నివేదిక (Hindenburg Research) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటే (Supriya) అన్నారు. ఈ కుంభకోణంలో అదానీ ప్రమేయం ఉన్నందునే అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపడం లేదా అని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నుంచి పలుమార్లు ఆదేశాలు జారీ అయినప్పటికీ సెబీ (SEBI) చురుకుగా దర్యాప్తు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇది పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నదని, నేరపూరిత కుట్ర కాక ఇది మరేమిటని ఆమె నిలదీశారు. మరోవైపు అదానీ గ్రూప్‌పై ఏడాదిన్నర కిందట సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్‌ తాజా ఆరోపణలు (Hindenburg Research) కలకలం రేపుతున్నాయి. అదానీ గ్రూప్‌ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌, ఆమె భర్త ధవళ్‌ బుచ్‌కు వాటాలున్నాయని లేటెస్ట్‌ రిపోర్ట్‌లో పేర్కొనడం దుమారం రేపుతోంది.

Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు 

కాగా హిండెన్‌బర్గ్‌ నివేదికపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భగ్గుమన్నారు. గ్వాలియర్‌లో కేంద్ర మంత్రి ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, దేశంలో అరాచకం వ్యాప్తి చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వివాదాస్పద వ్యవహారాల్లో దేశం నలిగిపోవాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటుందని మండిపడ్డారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Share Now
Advertisement