Women's Asia Cup T20 2024: పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్, మహిళల ఆసియా కప్ టోర్నీలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో నేడు (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది దేశం పాకిస్తాన్ భారత మహిళల బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.
మహిళల ఆసియా కప్ టోర్నీని టీమిండియా విజయంతో ప్రారంభించింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో నేడు (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది దేశం పాకిస్తాన్ భారత మహిళల బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.
పాక్ ఇన్నింగ్స్‌లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) పూర్తిగా నిరాశ పరిచారు.రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు. శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఇదే! టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, రెండు, వన్డే, టీ-20 లకు వైస్ కెప్టెన్ గా గిల్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ ఈ మ్యాచ్ జులై 21న యూఏఈతో తలపడనుంది. ఈ రోజు జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్‌కు ఆసియా కప్‌లో మొదటిది.