India Post Office Recruitment 2023: భారీ ఎత్తున పోస్టల్ జాబ్స్ భర్తీ, 40వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లై చేసుకునేందుకు రేపే చివరి తేదీ

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది

India Post (Photo credit: India post @PostOffice.IN facebook page)

New Delhi, FEB 15: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల(postal jobs)కు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి గత నెల 27 నుంచి తపాలాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇండియా పోస్ట్‌(India post) విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏపీలో 2480 పోస్టులు ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 1266 పోస్టులు ఉన్నాయి.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల 

దరఖాస్తుల్లో తప్పులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు గడువు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది). కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం కూడా రావాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.

Jobs in Singareni: సింగరేణిలో కొలువుల జాతర, 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ, ఈ జిల్లాల వారికి బంపర్ ఆఫర్, పోస్టుల్లో 95 శాతం వాళ్లకే, దరఖాస్తు చేసుకునే పద్దతి ఇదే! 

వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆయా సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాల్సి ఉంటుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now