IPL Auction 2025 Live

India Coronavirus: ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు

గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా (COVID-19 Cases) నిర్ధారణ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

Coronavirus Outbreak in India (Photo-PTI)

New Delhi, June 25: భారత్‌లో కరోనా కేసులు (Coronavirus) రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా (COVID-19 Cases) నిర్ధారణ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ సర్కారు, ప‌శ్చిమ బెంగాల్‌లో 15 వేలకు దగ్గరలో కోవిడ్-19 కేసులు

తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్‌ (India coronavirus) నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Here's ANI Tweet

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 23న దేశంలో 1,25,101 కరోనా కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య జూన్‌ 25 నాటికి 4,73,105కు పెరిగింది. అంటే దీనిప్రకారం నెల రోజుల్లోనే దేశంలో సుమారు మూడు లక్షల యాభైవేల కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1న లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా కేసులు సంఖ్య దేశంలో మరింతగా పెరిగింది. ఇక దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి నిన్నటి వరకు మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలు

1. మహారాష్ట్ర- 1,42,900 కేసులు, 6,739 మంది మృతి

2. ఢిల్లీ- 70,390 కేసులు, 2365 మంది మృతి

3. తమిళనాడు- 67,468 కేసులు, 866 మంది మృతి

4. గుజరాత్‌- 28,943 కేసులు, 1735 మంది మృతి

5. ఉత్తరప్రదేశ్‌- 19,557 కేసులు, 596 మంది మృతి

6. రాజస్థాన్‌- 16,009 కేసులు, 375 మంది మృతి

7. పశ్చిమబెంగాల్‌- 15,173 కేసులు, 591 మంది మృతి

8. మధ్యప్రదేశ్‌- 12,448 కేసులు, 534 మంది మృతి

9. హర్యానా- 12,010 కేసులు, 188 మంది మృతి

10. తెలంగాణ- 10,444 కేసులు, 225 మంది మృతి

11. ఆంధ్రప్రదేశ్‌- 10,331 కేసులు, 124 మంది మృతి

 



సంబంధిత వార్తలు