Kolkata, June 25: కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (West Bengal Govt) అప్రమత్తమైంది. కోవిడ్ 19 నియంత్రణ కోసం మమత సర్కారు (Mamata Banerjee) పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు (Lockdown Extension) బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు
కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో.. మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ పాఠశాలలు, కళాశాలలు తెరవబడవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైళ్లు, మెట్రో సర్వీసులు కూడా నడవవు అని చెప్పింది. బెంగాల్ లో ఇప్పటి వరకు 14,728 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 580 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,218 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Here's ANI Tweet
Lockdown in the state extended till 31st July with certain relaxations: West Bengal Government pic.twitter.com/utW4X2u6oT
— ANI (@ANI) June 24, 2020
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ( Coronavirus Outbreak) ఉగ్రరూపం దాల్చుతోంది. ఇండియాలో రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు (India's Coronavirus Report), మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు (New Cases in India) నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు.
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు 73,52,911 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
English link : 1845086