India's Coronavirus Report: ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు
Coronavirus Global Report Nearly 1 lakh new corona cases in 24 hours globally, US leads (Photo-PTI)

New Delhi, June 24: దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ( Coronavirus Outbreak) ఉగ్రరూపం దాల్చుతోంది. ఇండియాలో రోజురోజుకూ భారీగా పాజిటివ్‌ కేసులు (India's Coronavirus Report), మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు (New Cases in India) నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. కరోనాకు చెక్ పెట్టేందుకు కోరోనిల్, 150కి పైగా ఔషద మొక్కల నుంచి మందును తయారుచేసినట్లు వెల్లడించిన పతంజలి సంస్థ, మార్కెట్లోకి విడుదల చేసిన రాందేవ్ బాబా

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు 73,52,911 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సారి హ‌జ్ యాత్ర‌కు అనుమతి లేదు, వారి డ‌బ్బును తిరిగి చెల్లించ‌నున్న‌ట్లు తెలిపిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ

దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 10,994 మంది 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారని కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,58,685 మంది కోలుకున్నట్లయిందని, రికవరీ రేటు 56.38 శాతంగా ఉందని వెల్లడించింది. ఒక్క రోజులోనే 15,968 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 93.59 లక్షల మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడగా.. 4.79 లక్షల మంది మరణించారు. అత్యధిక కరోనా కేసులతో అమెరికా (24.42 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ (11.51 లక్షలు), రష్యా (5.99లక్షలు) దేశాలు ఉన్నాయి. అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.